టీం జగన్ కోసం5-8-2018 , 10.30 AMవేదిక : బసవపున్నయ్య ఆడిటోరియం#TEAMJAGANKOSAMSOCIALMEDIAMEET
ఉదయం పదిగంటలకు ఒక్కొక్కరుగా వైసీపీ అభిమానులు రావటంతో ప్రారంభమైన సమావేశంలో ముందుగా వైస్సార్ గారి వీడియో క్లిప్పింగ్స్ తో మొదలై తర్వాత బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని వైస్సార్ దాతృత్వం గురించి ఆయన గురువు గారి పేరు మీద స్థాపించిన 2500 మందికి ఉచిత విద్యని అందించే వెంకటప్పయ్య మెమోరియల్ స్కూల్ గురించి ఆ స్కూల్ ని వారి తర్వాత అదే స్ఫూర్తి తో కొనసాగిస్తూ తండ్రి ఆశయాలని నెరవేరుస్తున్న జగన్ , భారతమ్మ గార్ల గురించి , ఒక వీడియో ప్రదర్శనతో మొదలు పెట్టారు .
అప్పటి వరకు రిలాక్స్డ్ గా వాలి కూర్చొన్న సభికుల్లో ఓ ఆసక్తి , ఆ వీడియో ఐపోయే సరికి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు కళ్ళముందు కదలాడినట్లు ఐ మౌనంగా ఆసాంతం తిలకించి మరో సారి రాజన్న గొప్పతనాన్ని , ఔన్నత్యాన్ని అందరూ గుర్తు చేసుకొని వారి కోసం ఒక నిమిషం మౌనం పాటించారు .
ఆ తర్వాత జగన్ కోసం టీం స్థాపకుడు రవీంద్ర ఇప్పాల ప్రసంగం మొదలైంది .
ప్రసంగ సారాంశం క్లుప్తంగా :
అందరికి నమస్కారం నా పేరు రవీంద్ర ఇప్పాల .
మనందరం వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారమైనా మనందరి ఆశ , ఆశయం ఒక్కటే జగనన్న ని సీఎం గా చూడటం . అయితే దీనికి ప్రధాన అడ్డంకి అధికార టీడీపీ పార్టీ , దానికి వంత పాడే ఎల్లో మీడియా అవి జగనన్న పై , వైసీపీ పై చేస్తున్న దుష్ప్రచారం .
దీన్ని అడ్డుకొని తిప్పికొట్టటానికి వారికి ఉన్నన్ని ఛానెల్స్ పత్రికలు మనకు లేవు . అలాంటి టైంలో మనకి అంది వచ్చిన అస్త్రమే సోషల్ మీడియా . ఇక్కడ కూడా జగనన్న పై , పార్టీ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి పోరాటం సాగిస్తున్నవాళ్ళమే మనమందరం కూడా .
ఇంకా మనలో చాలా మంది సోషల్ మీడియా వలన ఎంత ప్రభావం ఉంటుంది అని ఒక గందరగోళ ఆలోచనతో మాట్లాడటం మనం అక్కడ అక్కడ చూస్తునే ఉన్నాం . మేము ఇక్కడ బలంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే - సోషల్ మీడియా విప్లవం ప్రపంచ గతినే మార్చివేసింది " 5 కోట్ల మందికి రేడియో దగ్గర కావటానికి 38 ఏళ్ళు పట్టింది, టి.వి కి 14 ఏళ్ళు పట్టింది, ఇంటర్నెట్ కి 4 ఏళ్ళు పట్టింది. కాని ఫేస్ బుక్ 100 కోట్ల మందికి 9 నెలలలో చేరువైంది .
ఇది గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి ముఖ్యమైన ఆయుధంగా సోషల్ మీడియాని ఎంచుకున్నాయి. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా తమ సిద్ధాంతాలని భావాల్ని తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేర్చవచ్చు కాబట్టి.
2014 ఎన్నికలలో మన దేశంలో కూడా సోషల్ మీడియా ప్రభావం వలన ఓటింగ్ శాతం పెరిగింది అని అనేక సంస్థలు చెబుతున్నాయి. మోడీ గెలుపులో కూడా సోషల్ మీడియా ప్రభావం అనేది ఎంత ఉందో మనం చెప్పుకోవలసిన అవసరం లేదు అనేక సర్వేలే చెబుతున్నాయి . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి విస్తృతంగా ప్రచారం చేసిన బీజేపీ , ఆప్ పార్టీల గెలుపులో దీని ప్రభావం , పాత్ర ఎంతో ఉంది .
సోషల్ మీడియా వేదికగా జగనన్న పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఎప్పటికప్పుడు నిజానిజాల్ని ప్రపంచానికి వెల్లడిస్తూ వచ్చాము మనందరమూ . ఈ క్రమంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్న , అధికార పార్టీ వారు అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టినా భయపడకుండా మన పోరాటాన్ని కొనసాగిస్తున్నాం .
దురదృష్టవశాత్తు 2014 లో అతి కొద్ది తేడాతో ఓడిపోయినా కృంగిపోకుండా భవిష్యత్ కోసం మరింత పోరాడాలి .జగనన్న ని ముఖ్యమంత్రిగా చూడాలి అనే ఆశయ సాధనలో భాగంగా విడివిడిగా వ్యక్తుల కన్నా ఒక వ్యవస్థగా ఏర్పాటు అయితే మరింత సమర్ధంగా పని చేయగలము అనే ఉద్దేశంతో జగనన్న అభిమానుల్ని కొందర్ని కలుపుకొని ఏర్పాటు చేసిందే
జగన్ కోసం టీం .
అలా 2015 లో స్థాపించిన జగన్ కోసం టీం ద్వారా టీం లోని మిత్రుల సహకారంతో అధికార టీడీపీ అన్యాయాలను , అక్రమాలను ఎన్నిటినో బయట పెట్టి ప్రజలకు చేరవేయటంలో విజయం సాధించాం . ఇంకా మరెన్నో అక్రమాలు , లోటు పాట్లు బయట పెట్టి అరాచక టీడీపీ పాలనని అంతమొందించి రాజన్న రాజ్యాన్ని స్థాపించుకోవాల్సిన అవసరం మన ముందుంది .
నిజా నిజాలకు ఆమడ దూరం ఉండే ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా వైపు ఎదురు చూస్తూ కాలం వెళ్లదీయకుండా, మన అందరికి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ను ఉపయోగించి మరింత ఉధృతంగా కృషి / పోరాటం చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది
అందులో భాగంగానే మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి అనే ఉద్దేశ్యంతోనే ఈ సమావేశం ఏర్పాటు జరిగింది . మీరు పోస్ట్ చేసే అంశాలకి కావాల్సిన సమాచారం మేమందిస్తాం . అలాగే మీ కళ్లెదురుగా స్థానికంగా మీ నియోజక వర్గాల్లో జరిగిన , జరుగుతున్న అవినీతి అక్రమాలని , అధికార పార్టీ దుచ్చర్యలని చూసి కూడా స్థానికంగా ఉంటున్నాం . మళ్ళీ మనకు ఇబ్బంది కలగొచ్చు ఎందుకులే అని ఆలోచించి పోస్ట్ చేయలేని విషయాలని మన టీం కి అందించండి . టీం జగన్ కోసం పేజీలో పోస్ట్ చేస్తాం . మీకు ఇబ్బంది కలక్కుండా చూసుకొంటాం .
ఇహ మనం ఎలా పోస్ట్ చేయాలి . పేజ్ , గ్రూప్ లను ఎలా మైంటైన్ చేయాలి . ట్విట్టర్ ని ఎలా వాడుకోవాలి , యూట్యూబ్ , ట్విట్టర్ , ఫేస్ బుక్ లలో పార్టీని ఎలా ప్రమోట్ చేసుకోవాలి లాంటి విషయాలను మన టీం సభ్యుడు సూర్య భగత్ గారు వివరిస్తారు .
ఇది స్థూలంగా రవీంద్ర ఇప్పాల ప్రసంగ సారాంశం .
సమయం 11.45 AM
బక్కపలచగా ఉన్న మీడియం హైట్ కుర్రాడు కళ్ళద్దాలతో లాప్టాప్ , రెండు ఫోన్లు , ఇంకా నాలుగు వైర్లతో స్టేజి ఎక్కి అన్ని సర్దుకొని అమాయకంగా హలో హెలో అని మైక్ టెస్ట్ చేసుకొన్నాడు .
అతనే సూర్య భగత్ . క్లాస్ లోకి మొదటి సారి వచ్చిన కుర్ర ఫ్రొఫెసర్లా కొంచెం అమాయకంగా చూస్తూ మైక్ అందుకొన్నాడు .
వన్ మెన్ షో అలా మొదలైంది
5-08-2018 , 11.45 AM
మైక్ అందుకొన్న సూర్య భగత్ తనని తాను పరిచయం చేసుకుని ముందుగా fb లో అకౌంట్స్ , పేజెస్ , గ్రూప్స్ , ట్విట్టర్ , యూట్యూబ్
వంటి వాటిల్లో మీరెదుర్కొన్న అనుభవాలు , సమస్యలు , మీకున్న అనుమానాలు చెప్తే వాటిని నోట్ చేసుకొని చర్చ ఐపోయే లోపు సమాధానాలు ఇస్తాను అని చెప్పి మైక్ జనంలోకి పంపారు .
ఒక్కోరు ఒక్కో రకమైన ప్రశ్నలు సంధించారు , అన్నిటినీ సావధానంగా విని అన్ని రాసుకొని ఇహ అసలు విషయంలోకి వెళ్ళిపోయాడు . సోషల్ మీడియా దాని విస్తృత ప్రభావం , మనం ఎలా వాడుకోవాలి , fb ఒక్కటే కాకుండా ట్విట్టర్ , యూట్యూబ్ లలో ఎలా ట్రెండ్ చేయాలి లాంటి టెక్నికల్ అంశాల్ని ప్రస్తావించిన తర్వాత ,
వైసీపీ పార్టీ ఆఫీషియల్ పేజెస్ , జగన్మోహన్ రెడ్డి , విజయసాయి రెడ్డి గార్ల సోషల్ మీడియా అకౌంట్స్ , పార్టీ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రిప్షన్ గురించి వాటిని ఎలా ప్రమోట్ చేయాలి , ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం , మొదటి స్థానంలోకి రావటానికి ఎలా కృషి చేయాలి లాంటి అంశాలను ఓ అనుభవజ్ఞుడు అయిన ఫ్రొఫెసర్ లా చెప్పుకొంటూ వెళ్తుంటే సభికులు రెప్ప ఆర్పకుండా చూస్తూ చెవులు అప్పగించేశారు .
2014 - 15 స్టాటిస్టిక్స్ ప్రకారం 14-22 మధ్య వయసులో ఎంత మంది ఉన్నారు , వారిలో ఇప్పుడు ఓటు హక్కు వస్తున్న వారు ఎంత మంది ఉంటారో వారిని, న్యూట్రల్ పీపుల్ ని ఎలా ఆకర్షించి వైసీపీ ఓటుబ్యాంక్ గా మార్చవచ్చో లెక్కలతో చెప్పిన తీరు అద్భుతః .
టైం చూసుకొని లంచ్ బ్రేక్ అనౌన్స్ చేసే వరకు ఎవరికి ఆకలి కూడా గుర్తురానంతగా లీనం అయిపోయారు .
1.30 pm To 2.30 pm
లంచ్ బ్రేక్
అందరం భోజనాలు చేస్తూ ప్రొఫైల్ పిక్చర్ ని గుర్తు పెట్టుకొని పలకరించిన వాళ్ళతో వారి ఏరియాలో వైసీపీ పార్టీ ముచ్చట్లు చెప్పుకొంటూ భోజనాలు ముగించి మళ్ళీ సీట్లకి అతుక్కుపోయారు .
తర్వాత తన మాయాజాలం మళ్ళీ మొదలైంది .
ఉదయం అడిగిన ప్రశ్నలకి ఒక్కో దానికి వివరంగా సమాధానం ఇచ్చి , జరిగిన మీట్ మీద డౌట్స్ ఉంటే చెప్పమని మళ్ళీ డౌట్స్ రాసుకొని వాటన్నింటికి తగ్గ ఆన్సర్స్ ఇచ్చి తన స్పీచ్ ముగించగానే బసవపున్నయ్య ఆడిటోరియం సభికుల కరతాల ధ్వనులతో మారుమోగిపోయింది .
దేశంలో నాలుగో స్థానంలో ఉన్న వైస్సార్సీపీ సోషల్ మీడియా ఏ ఒక్క ఆర్గనైజేషన్ తోనో సాధ్యపడలేదు . ఇనార్గనైజ్డ్ గా ఉన్న పార్టీ అభిమానుల స్వచ్ఛంద సహకారం వల్లనే ఇది సాధ్యపడింది అన్న ఓ సోదరుని మాట నాకు ఈ సందర్బంగా గుర్తు వచ్చింది .
ఈ రోజు జరిగిన మీట్ ని గెట్ టు గెదర్ కార్యక్రమం అనే కన్నా అవేర్ నెస్ ప్రోగ్రామ్ , ట్రైనింగ్ క్లాస్ అనటం కరెక్ట్ . నిజంగా కార్యకర్తల్ని చాలా మోటివేట్ చేసిన మీట్ ఇది . ఇంతవరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగక పోవటం చాలా బాధాకరం .
ఎలెక్షన్ కి మనకున్న సమయం చాలా తక్కువ . అందుకోసం మనం ఎంతో కృషి చేయాల్సి ఉంది . పార్టీ విధానాలని , మేనిఫెస్టో లోని అంశాల్ని , వాటితో ఓనగూరే ప్రయోజనాలని , అధికార టీడీపీ అవినీతి, అక్రమాలని , మన పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దౌర్జన్యాలని సోషల్ మీడియా వేదికగా బయట పెట్టి తద్వారా ప్రజల్ని మన పార్టీకి అనుకూలంగా మారేలా కృషి చేసే విధంగా సోషల్ మీడియా వాలంటీర్స్ కి ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని జరిగితే మంచి ఫలితాలు పొందొచ్చు ..
జోహార్ వైస్సార్ , జై జగన్
2 Comments
jai jagan
ReplyDelete#Teamjagankosam always works for ysr family.jaijagan johar ysr
ReplyDelete